SLBC Tunnel Collapse Update

Hyderabad, Mar 9: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో (SLBC Tunnel Update) కీలక ఘట్టం చోటుచేసుకుంది. కార్మికుల జాడ కనుగోవడంలో ఎట్టకేలకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది. కేరళకు (Kerala) చెందిన క్యాడవర్ డాగ్స్ ఘటన జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. అక్కడ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారు. కొద్దిసేపట్లో గల్లంతైన వారి ఆచూకీ లభించే అవకాశం ఉంది. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో ఈ డాగ్స్‌ ను కార్మికుల జాడను గుర్తించేందుకు తీసుకువచ్చారు. కేరళ వరదల సమయంలో కూడా క్యాడవర్‌ డాగ్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే కార్మికుల జాడ కోసం ప్రభుత్వం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే కొద్దిసేపట్లో గల్లంతైన వారు ఆచూకీ లభించే అవకాశం ఉంది.

నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!

16 రోజుల నుంచి ప్రయత్నాలు

SLBC టన్నెల్ పనుల్లో భాగంగా కార్మికులు ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. ఆ సమయంలోనే  టన్నెల్‌ పైకప్పు భాగం కూలిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఇందులో 8 మంది కార్మికులు ఉండగా అందులో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. 16 రోజులు నుంచి ప్రభుత్వం దగ్గర ఉండి సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటివరకు వారు ఇంకా బతికే ఉంటారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)