Newdelhi, May 25: ఆన్ లైన్లో (Online) ఆధార్ (Aadhaar) వివరాలను ఉచితంగా అప్ డేట్ (Free Update) చేసేందుకు జూన్ 14 తేదీ చివరిది. ఆ తర్వాత అప్ డేట్ చేసుకొనే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు యూఐడీఏఐ మరోసారి గుర్తు చేసింది. గత పదేండ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్ డేట్ చేసుకొని వారు ఈ ఉచిత అప్ డేట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే జూన్ 14 తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పోతుందని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్నది. దీనిపై కూడా యూఐడీఏఐ స్పందించింది.
ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
UIDAI has also clarified that your Aadhaar card will not become invalid after June 14. It will remain valid and usable as before. The only change is that the free update facility will no longer be available after this date.
— RAMANATHAN KRISHNAN ( Modi ka Parivar) (@ramandialnet) May 24, 2024
యూఐడీఏఐ ఏమన్నది?
పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పోతుందన్న ప్రచారాన్ని యూఐడీఏఐ ఖండించింది. జూన్ 14 తేదీ అనేది ఉచిత అప్ డేట్ కు చివరి అవకాశమే తప్ప పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పొవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.