Mumbai, May 25: చరిత్ర కాల గర్భంలో మరొక నెల కలిసిపోనున్నది. మరో ఆరు రోజుల్లో 2024 మే నెల పూర్తయి జూన్ నెలలో ఎంటర్ కానున్నది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్ ఖాతాలు (Banks) నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నా, ఒక్కోసారి ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికీ ఇప్పుడు సమయం ఎంతో కీలకం. కనుక బ్యాంకు శాఖలకు వెళ్లాలనుకున్నప్పుడు ఆ రోజు బ్యాంకులు (Bank Holidays) పని చేస్తున్నాయా..? లేదా..? అన్న సంగతి చెక్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జూన్ నెలలో 30 రోజులకు గాను 10 రోజులు బ్యాంకులకు సెలవులను ప్రకటించింది ఆర్బీఐ. మరి రాష్ట్రాల వారీగా బ్యాంకులకు గల సెలవుల జాబితాను తెలుసుకుందామా..!
రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు 2,9,16, 23, 30 తేదీల్లో ఆదివారాలు కలుపుకుని మొత్తం ఐదు రోజులు సెలవు. జూన్ 8న రెండో శనివారం, 22న నాలుగో శనివారం.
2 జూన్ – ఆదివారం
8 జూన్ – రెండో శనివారం
9 జూన్ – ఆదివారం
15 జూన్ – వైఎంఏ డే, రాజా సంక్రాంతి సందర్భంగా భువనేశ్వర్, ఐజ్వాల్ జోన్లలో బ్యాంకులకు సెలవు.
16 జూన్ – ఆదివారం
17 జూన్ – బక్రీ ఈద్ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
18 జూన్ – బక్రీ ఈద్ సందర్భంగా జమ్ము, కశ్మీర్ జోన్లలో బ్యాంకులకు సెలవు.
22 జూన్ – నాలుగో శనివారం
23 జూన్ – ఆదివారం
30 జూన్ – ఆదివారం