PAN-Aadhaar Linking

పాన్ కార్డు గల వారంతా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుందనే విషయం విదితమే. ఇప్పటికే పాన్-ఆధార్ అనుసంధాన గడువు ముగిసిపోయింది. ఇప్పటికీ ఆధార్ తో అనుసంధానించని వారి పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోయి ఉంటుంది. అటువంటి వారు రూ.1000 ఫైన్‌తో ఆధార్-పాన్ కార్డును అనుసంధానించుకోవాలి. ఇది కూడా ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయం పన్ను విభాగం హెచ్చరించింది.ఆలోపు పాన్‌ యాక్టివేట్‌ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది.

గడువు లోపు పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించని వారు గత మార్చి నెలాఖరు నాటికి జరిపిన ఆర్థిక లావాదేవీలపై పన్ను కోత లేదా పన్ను పేమెంట్స్ ఎక్కువ రెట్లు చెల్లించాల్సి ఉంటదని తేల్చి చెప్పింది. పాన్ కార్డు నిరుపయోగంగా మారిన పన్ను చెల్లింపు దారుల్లో కొందరికి ఇప్పటికే టీడీఎస్.. టీసీఎస్ పేమెంట్స్ ఎగవేతకు పాల్పడినట్లు నోటీసులు జారీ చేశామని తెలిపింది. ఆధార్ కార్డ్ ఇంకా అప్ డేట్ చేసుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్, ఫ్రీగా ఆదార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రో ఛాన్స్

లింక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి

మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే లింక్‌ అయినట్లు సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్‌ చెల్లించి ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి చేయాలి. షాకింగ్ న్యూస్, 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్, కీలక వివరాలను వెల్లడించిన సీబీడీటీ

ఫైన్‌ చెల్లించి ఎలా లింక్ చేసుకోవాలంటే..

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాలి. అందులో ‘ఈ-పే ట్యాక్స్‌’పై క్లిక్‌ చేయాలి.

అక్కడ పాన్‌ నంబర్‌ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

తర్వాతి పేజీలో మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి.

వెరిఫికేషన్‌ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి.

తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్‌ ఇయర్‌ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్‌ రిసిప్ట్స్‌ (Other receipts (500) ఎంచుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్‌ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.

పేమెంట్‌ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని లింక్‌ ఆధార్‌ను క్లిక్‌ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.