
Jagtial, Mar 9: ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు (Hotels), రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీలో బొద్దింక దర్శనం ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ బిర్యానీలో బొద్దింక రావడం గమనించి రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశాడు. వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. కిచెన్ లోకి వెళ్లి చూడగా అక్కడా శుభ్రత లేకుండా ఇష్టారాజ్యంగా వంటలు చేస్తున్నట్టు గుర్తించాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని సదరు కస్టమర్ డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
బిర్యానీలో బొద్దింక..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్
బిర్యానీలో బొద్దింక రావడంతో రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీసిన కస్టమర్
కిచెన్ లోకి వెళ్లి చూడగా ఇష్టారాజ్యంగా వంటలు చేస్తున్న సిబ్బంది
ఫుడ్ సెఫ్టీ అధికారులు చర్యలు… pic.twitter.com/hPsza1fuyA
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025
హైదరాబాద్ లోనూ అంతే..
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు (Hotels), రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ దీనికి అడ్డగా మారింది. అమీర్ పేటలోని అమోఘ, తాజా కిచెన్, మెహిదీపట్నంలోని 4 సీన్స్ మల్టీకజిన్ రెస్టారెంట్ లో బల్దియా అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేశారు. ఆయా హోటల్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. అధికారులు తాజాగా రైడ్స్ చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ లో వెజ్, నాన్‌వెజ్ ఒకే దగ్గర మిక్స్ చేసి వంటలు చేస్తున్నట్టు తేలింది. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర కలిపి నిల్వ చేస్తున్న రెస్టారెంట్ యాజమాన్యాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలంచెల్లిన వస్తువులు కూడా గుర్తించారు.