
ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితా తాజాగా విడుదలైంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ రూపొందించిన ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ ప్రకారం, ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత టాప్–20 నగరాల జాబితాలో 13 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది.
ఈ జాబితాలో అత్యంత కలుషిత నగరంగా అస్సాంలోని బైర్నిహాట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లన్‌పుర్, హర్యానాలోని ఫరీదాబాద్, ఘజియాబాద్, న్యూ ఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా వంటి నగరాలు ఉన్నాయి.
భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
ప్రత్యేకంగా ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా నిలవడం గమనార్హం. 2023లో ఇదే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ ప్రపంచంలోని మూడో అత్యంత కలుషిత దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన నివేదికలో ఐదో స్థానానికి పడిపోవడం స్వల్పమైన మెరుగుదలకే సంకేతం అయినప్పటికీ, దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇంకా పెద్ద ఎత్తున చర్యలు అవసరం.