Hyd, Nov 26: నవంబర్ 26.. భారత రాజ్యాంగ దినోత్సవం. 2015 నుంచి ప్రతి ఏటా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి 2015లో జరిగింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సీనియర్ సభ్యుడైన డాక్టర్ సర్ హరిసింగ్ గౌర్ పుట్టినరోజు కూడా నవంబర్ 26 కావడంతో వారిద్దరిగా నివాళులర్పించేందుకు మోడీ ప్రభుత్వం నవంబర్ 26, 2015లో రాజ్యాంగ దినోత్సవాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాత పార్లమెంటు భవనంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగ 75 వసంతాల కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఢిల్లీలో ఉన్న వివిధ శాఖల అధిపతులు పాల్గొంటారు.
మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం- రాజ్యాంగం ద్వారా సంక్రమించినవే. ఏ హక్కుల కోసం అయితే బ్రిటిష్ పాలకులతో పోరాటం చేశారో- ఆ హక్కుల్ని రాజ్యాంగంలో భారత పౌరులందరికీ అందజేశారు. రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు- తరతరాల భారత పౌరులకు అందించిన గొప్ప వరం అనే చెప్పాలి.
రాజ్యాంగంలోని 23వ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది. కేవలం అంటరానితనాన్ని నిషేధించం మాత్రమే కాకుండా- రిజర్వేషన్ల రూపంలో సరికొత్త సమాజిక ఇంజినీరింగ్‌కు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పడటాన్ని నిషేధించింది. పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, ఢిల్లీ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చానని వెల్లడి
దేశ పౌరులు తమ ఆత్మప్రబోధానుసారం తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ కల్పిస్తోంది. భారత రాజ్యాంగం మాత్రం స్వాతంత్య్రం పొందిన వెంటనే కులం, మతం, లింగభేదం- చదువు, ధనిక, పేద ఇలాంటి వివక్ష లేకుండా వయోజనులందరికీ సార్వజనీన ఓటు హక్కు అందించింది.
భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రధానమైనది. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ- సమాజ భద్రత, జాతీయ భద్రత, నైతికత అనే హద్దులకు లోబడి ఉంటుంది. ఈ మేరకు రాజ్యాంగం సూచించింది.