IRCTC Goa Tour Package: గోవా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్! తక్కువ ధరకే వారం రోజుల పాటూ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
గోవా వెళ్లేందుకు ప్లాన్ (Goa Plan) చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకోసం అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ సమయంలో మీ జర్నీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
Hyderabad, March 08: గోవా వెళ్లేందుకు ప్లాన్ (Goa Plan) చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకోసం అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ సమయంలో మీ జర్నీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు గోవాలోని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు గోవా అందాలను దగ్గరగా చూస్తే ఎంజాయ్ చేయాలంటే.. మీ బడ్జెట్‌లోనే ఈ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇప్పుడే బుక్ చేసుకోండి. ఈ వేసవిలో గోవా టూర్ అసలు మిస్ చేసుకోవద్దు.
3 నైట్స్, 4 డే టైమ్.. డిలైట్ టూర్ ప్యాకేజీ :
ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీలో కోడ్ (SHA03) అనే ‘గోవా డిలైట్’ పేరుతో ప్రారంభించింది. ఈ ప్యాకేజీ కింద 3 నైట్స్, 4 డే టైమ్స్ వరకు గోవాలోని అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఫుల్ జర్నీ ప్లాన్, ప్రారంభ తేదీ వివరాలివే :
మీ ప్రయాణం సాఫీగా ఉండేలా ఫ్లయిట్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
స్థానిక ప్రదేశాలను విజిట్ చేసేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
ఈ ప్యాకేజీ మార్చి 20, 2025 నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ లోకేషన్ నుంచే ట్రిప్ మొదలువుతుంది.
ఫుడ్, రూమ్ సౌకర్యాలివే :
టూర్ ప్యాకేజీలో బ్రేక్ ఫాస్ట్, మీల్స్, రాత్రి భోజనానికి పూర్తి ఏర్పాట్లు చేస్తారు.
ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా హోటళ్లలో వసతి కల్పిస్తారు.
ప్యాకేజీలో లభించే సౌకర్యాలివే :
ఇందులో షేరింగ్ ఆప్షన్ ఉంది. ఏసీ కోచ్‌లలో టూర్ ప్లాన్ ప్రకారం మీ సందర్శనా స్థలాలను ఎంచుకోవచ్చు.
ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్)
ప్రయాణ సమయంలో ఐర్‌సీటీసీ ఎస్కార్ట్ సర్వీసులు
అన్ని సర్వీసులకు ట్యాక్సులు వర్తిస్తాయని గమనించాలి.
ఐర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ ధర ఎంత? :
ప్రయాణ సమయంలో ఛార్జీలు ఇలా ఉంటాయి
ఒక్కొక్కరికి : రూ. 24,485
ఇద్దరు వ్యక్తులలో ఒక్కొక్కరికి : రూ. 20వేలు
ముగ్గురు వ్యక్తుల్లో ఒక్కొక్కరికి : రూ. 19,625
ఎలా బుక్ చేసుకోవాలి? :
మీరు ఈ ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీని పొందవచ్చు. మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com)ని విజిట్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)ని సంప్రదించవచ్చు.
(The above story first appeared on LatestLY on Mar 08, 2025 09:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

