Indian Air Force’s Transport Aircraft Crash Lands in West Bengal (Photo Credits: X/@AdityaRajKaul)

Kolkata, March 07: ఒకే రోజు భారత వాయుసేనకు (IAF) చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఏఎన్‌-32 విమానం పశ్చిమ బెంగాల్‌లోని బగ్‌డోగ్రాలో కుప్పకూలింది. ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హర్యానాలోని పంచకులలో జాగ్వార్‌ యుద్ధ విమానం కూలిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Indian Air Force’s Transport Aircraft Crash Lands in West Bengal

 

మరోవైపు, హర్యానాలోని పంచకులలో వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం శుక్రవారం కుప్పకూలింది.  అంబాల వైమానిక స్థావరం నుంచి శిక్షణ కోసం బయలుదేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది.