
Delhi, March 09: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు కలకలరం రేపింది. లాంగ్ ఐలాండ్‌లోని హెంప్టన్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి(Fire Breaks Out In New York). కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో హైవేలు మూసివేశారు. మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లాంగ్ ఐలాండ్‌లో కార్చిచ్చు – భీకరంగా ఎగిసిపడుతున్న మంటలు, హైవేలు మూసివేత
శనివారం నాడు లాంగ్ ఐలాండ్‌లోని సఫోక్ కౌంటీలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక అడవి మంటలు చెలరేగాయి. తక్కువ తేమ, బలమైన ఈదురుగాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించడంతో హైవేలు మూసివేయాల్సి వచ్చింది(New York fire breaks out). మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోవడానికి, నియంత్రించడానికి మా శక్తివంతమైన రక్షణ చర్యలను ప్రారంభించాం కానీ ఇప్పటివరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు అమెరికా అధికారులు తెలిపారు.
బలమైన ఈదురుగాలుల కారణంగా ఆదివారం వరకు మంటలు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అయితే స వెస్ట్‌హాంప్టన్ ప్రాంతంలోని మంటలను శనివారం సాయంత్రానికి 50% వరకు అదుపులోకి తెచ్చారు.
న్యూయార్క్ నేషనల్ గార్డ్ కూడా సహాయ చర్యల్లో పాల్గొంది. HH-60W జాలీ గ్రీన్ II హెలికాప్టర్, మూడు న్యూయార్క్ ఆర్మీ నేషనల్ గార్డ్ హెలికాప్టర్లు రోంకోంకోమా ప్రాంతం నుండి నీటి త్రవ్వజలాలతో మంటల్ని ఆర్పేందుకు సహాయపడుతున్నాయి.
Massive Fire Breaks Out in New York, Flames Rise High
న్యూయార్క్‌లో కార్చిచ్చు.. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
లాంగ్ ఐలాండ్‌లోని హోంఫ్టన్స్ లో భారీగా మంటలు
కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో హైవేలు మూసివేత
తీవ్రంగా శ్రమిస్తూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/iB0Ucsf9sC
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025
డ్రోన్ల ద్వారా మంటల వ్యాప్తిని గమనించేందుకు వినియోగిస్తున్నారు. న్యూయార్క్ స్టేట్ పోలీస్ విభాగం ప్రకారం, సన్‌రైజ్ హైవే (ఎగ్జిట్ 62 నుంచి ఎగ్జిట్ 64 వరకు) పూర్తిగా మూసివేయబడింది. అలాగే, సౌథాంప్టన్ పోలీసులు కౌంటీ రోడ్ 31 సౌత్‌బౌండ్ మూసివేయబడిందని ప్రకటించారు.