Mohan Babu’s Bouncers Go on Rampage Again – Restaurant Vandalized(X)

Tirupati, Feb 14:  మరోసారి మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు(Mohan Babu Bouncers). మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు MBU యూనివర్సిటీ(MBU University) P.R.O సతీష్, యూనివర్సిటీ బాడీగార్డ్స్ సంబంధం ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తోంది. బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సైతం వెల్లడించారు.

ఈ ఘటనపై స్పందించారు మంచు మనోజ్(Manchu Manoj). మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన F5 రెస్టారెంట్‌ను పరిశీలించారు మంచు మనోజ్. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టళ్లు, హోటళ్లు పెట్టుకుని బతుకుతున్నారు అన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రేమికుల రోజు కానుక.. హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ అప్‌డేట్, ఆకట్టకుంటున్న పోస్టర్ 

మోహన్ బాబు సిబ్బంది హేమాద్రి నాయుడు, ఫోటోగ్రాఫర్ మౌళి వారిని కొట్టి బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు అన్నారు.

Mohan Babu’s Bouncers Go on Rampage Again – Restaurant Vandalized

ప్రశ్నిస్తే వారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారు.. ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టికి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారు అన్నారు. మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను టార్గెట్ చేస్తున్నారు అన్నారు.

ఇది ఆస్తి గొడవలు కాదు.. ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటం అన్నారు. తెలంగాణలో మీడియా, పోలీసుల సహకారంతో బౌన్సర్ల ఆగడాలు కట్టడి చేయగలిగాం అని తెలిపారు మనోజ్.

Mohan Babu’s Bouncers Go on Rampage Again