ప్రేమికుల రోజు(Valentine's Day) కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్9Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు(HariHara Veera Mallu ) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజా రెండో సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

జ్యోతి కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తోంది. ఫస్ట్ పార్ట్‌ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతుంది.

వీడియో ఇదిగో, వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్, జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్న నెటిజన్లు

మార్చి 28న ప్రేక్ష‌కుల సినిమా రానుండగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెకండ్ సింగిల్‌ అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో(Kollagottanadhiro)తో వస్తోంది.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Happy Valentine's Day from #HariHaraVeeraMallu ❤️

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)