పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.దీంతో ఖర్మ కాలి పవన్ కళ్యాణ్ ను గెలిపించా అంటూ అనురుల వద్ద వర్మ కనీళ్ళు పెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
SVSN Varma is impatient after not getting an MLC seat
పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే గా చేసిన పిఠాపురం వర్మకు వెన్నుపోటు.
ఖర్మ కాలి పవణ్ కళ్యాణ్ ను గెలిపించా అంటూ వర్మ కనీళ్ళు#Pithapuram #Varma #MLCElections2025 #AndhraPradesh #UANow pic.twitter.com/8p2phApAxd
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)