జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి ఏపీ రాజకీయాలను వేడెక్కించారు. ఆయన మరోసారి చంద్రబాబు సీఎం అవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే అంటూ మరోసారి హీట్ ఎక్కించారు. జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇంకా టీడీపీ స్పందించలేదు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.దీంతో ఖర్మ కాలి పవన్ కళ్యాణ్ ను గెలిపించా అంటూ అనురుల వద్ద వర్మ కనీళ్ళు పెట్టుకున్నారు.
Chandrababu Naidu became Chief Minister because of Pawan Kalyan Says MLA Nadendla Monohar
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే
– జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ pic.twitter.com/QOaOk9Q9Wp
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)