![](https://test1.latestly.com/uploads/images/2025/02/big-alert-for-tirumala-devotess-who-is-going-to-tirumala-.jpg?width=380&height=214)
Tirupati, Feb 15: కళియుగ వైకుంఠం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది(Alert For Tirumala Devotees). నిన్న స్వామివారిని 64,527 మంది దర్శించుకోగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,129గా ఉంది. స్వామివారి హుండీ ఆదాయం 3.70 కోట్లు కాగా సర్వదర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
ఇక తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్(TTD Alert). ఇకపై రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే
అలాగే 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో(TTD Darshan) అనుమతించడం లేదు. చిరుతల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేగాదు నడక మార్గంలో విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
2023 ఆగస్టులో అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే.