ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపార నటుడు బాలకృష్ణ(Balakrishna). ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్(basava tarakarama hospital) ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ(NBK).. బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని మరింత విస్తరించనున్నామని తెలిపారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు.

మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్

ఇక మరో వార్తను పరిశీలిస్తే నటుడు మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు . మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు MBU యూనివర్సిటీ P.R.O సతీష్, యూనివర్సిటీ బాడీగార్డ్స్ సంబంధం ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తోంది. బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సైతం వెల్లడించారు.

Cancer Hospital in Tullur says TDP MLA Balakrishna

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)