Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
పరీక్షల భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Mancherial, Mar 4: పరీక్షల్లో ఫెయిల్ (Exam Fail) అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతుండేది. అయితే, చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో ఆ విద్యార్థినిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాడు. అయితే ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో, ఫెయిల్ అవుతానని భయపడ్డ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది, చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో విద్యార్థిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని… pic.twitter.com/XI0jvaT3ar
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025
నిన్నటికి నిన్న
పరీక్షల (Exams) భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి (Inter Student) ఫ్యాన్ కు ఉరేసుకున్న ఘటన మెదక్ లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన వైష్ణవి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. అయితే శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె.. చదువు ఇష్టం లేకపోవడంతో పాటు పరీక్షల భయంతో ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని అసలు పరీక్షల భయంతో చనిపోయిందా.. లేక… ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Men's Helpline Numbers:
Milaap: 9990588768; All India Men Helpline: 9911666498; Men Welfare Trust: 8882498498.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.
(The above story first appeared on LatestLY on Mar 04, 2025 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

