Railway (X)

Hyderabad, Mar 4: స్లీపర్‌, ఏసీ బోగీల్లో (AC Coaches) ప్రయాణం కోసం బెర్త్‌ రిజర్వు చేసుకున్నారు. అయితే అది కన్ఫాం కాలేదు. దీంతో మీరు వెయిటింగ్‌ లిస్ట్‌ (Waiting List) లో ఉన్నారు. ప్రయాణ సమయం ముంచుకొచ్చింది. ఏం చేస్తాం? రైలులో స్లీపర్‌, ఏసీ ఇలా ఏ బోగీ దొరికితే అందులో ప్రయాణిస్తాం. ఇది సాధారణమే కదూ. అయితే ఇకపై వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులు స్లీపర్‌, ఏసీ బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు. ఒకవేళ వెయిటింగ్‌ లిస్టెడ్‌ టికెట్లతో స్లీపర్‌, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఈ మేరకు రైల్వేశాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులు ఇకపై జనరల్‌ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలని కొత్త రూల్స్ చెప్తున్నాయి. ఈ నెల 1 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)

జరిమానా ఇలా..

వెయిటింగ్‌ లిస్ట్‌ లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్‌ వరకు టికెట్‌ ఛార్జీని, రూ.440 ఫైన్‌ ను చెల్లించాలి. స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే, రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్‌ వరకు టికెట్‌ ఛార్జీని చెల్లించాలి.

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్