
Vijayawada, Mar 4: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (Boat Capsizes In Rajamahendravaram) పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ (Boat) బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 20 మంది పడవలో సోమవారం రాత్రి లంకకు వెళ్లారు. వారిలో కొందరు తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ప్రమాద సమయంలో పడవలో 12 మంది ఉన్నారు.
ప్రమాదాన్ని గమనించి..
పడవలోకి నీరు వచ్చినట్టు గమనించిన 10 మంది నదిలోకి దూకి ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం (54), రాజు (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.