PRTU candidate Pingili Sripal Reddy wins Nalgonda Teacher MLC elections

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి ఉన్నారు.నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో జరిగిన కౌంటింగ్‌లో శ్రీపాల్ రెడ్డి తన ప్రత్యర్థులైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎంఎల్‌సి నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,139 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటలకు ముగిసింది. మొత్తం 25 టేబుళ్లలో కౌంటింగ్ నిర్వహించారు

ఇక , కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్ ఎంఎల్‌సిగా మల్క కొమురయ్య గెలుపొందారు.కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో 25,106 మంది ఓటు వేయగా బిజెపి మద్దతున్న కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి.

Pingili Sripal Reddy wins Nalgonda Teacher MLC elections

మరోవైపు కరీంనగర్ -మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ కొనసాగుతోంది. మంగళవారం వరకు ఫలితం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్, గెలుపు దిశగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి. కౌంటింగ్ సందర్భంగా నగరంలో అమల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతంలో సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాల వెలువడే వరకు మూడు షిఫ్ట్ లో బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.