
Hyd, Feb 22: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే మూడు మీటర్ల మేర కూలింది పైకప్పు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది(SLBC Tunnel Collapse).
ఇక SLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.
అలాగే SLBC టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలని డిమాండ్ చేశారు. పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగింది? చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఈ పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలి. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్ తవ్వాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అన్నారు కవిత.
Nalgonda SLBC Tunnel Collapse
SLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం ఆరా
ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చిన సీఎం https://t.co/FsdnLnuKM4 pic.twitter.com/qmwxK5f4fw
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పై కప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరం అన్నారు. కేసీఆర్ హయాంలో పది కి.మీ.ల మేర టన్నెల్ తవ్వారు. ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందన్నారు.
MLC Kavitha On Nalgonda SLBC Tunnel Collapse
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలే… పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగింది?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పై కప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్ గారి హయాంలో పది కి.మీ.ల మేర టన్నెల్ తవ్వారు. ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 22, 2025