Nalgonda District Intelligence SP Ganji Kavitha dismissed(X)

Nalgonda, January 11:  నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ శాఖ. సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కవిత పై అక్రమాలు, వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.

సొంత సిబ్బంది నుండి సైతం భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గత15 రోజులుగా కవిత అక్రమాల పై ఫోకస్ పెట్టిన రాష్ట్ర నిఘా విభాగం. రేషన్, గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టు నిర్దారణకు వచ్చారు. కవిత అక్రమాల్లో ఎస్ఐ,ముగ్గురు కానిస్టేబుల్లు,ఒక హెడ్ కానిస్టేబుల్ పాలుపంచుకున్నట్లు గుర్తించారు.

కవిత షాడో టీమ్ పైనా విచారణ కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతి బయటపెడతామంటూ కవితను నలుగురు రిపోర్టర్లు బ్లాక్ మెయిలింగ్ చేశారంటూ జిల్లాలో విస్తృత ప్రచారం జరగడమే కాదు ఆమె నుండి భారీగా డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. జిల్లా ఇంటెలిజెన్స్ అధిపతిగా ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా పని చేశారు కవిత.

కవిత అక్రమాలపై 9 పేజీల లేఖ విడుదల చేశాడు ఓ బాధితుడు. లేఖలో కళ్ళు బైర్లు కమ్మే అక్రమాలు బయటపెట్టాడు. ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూళ్లు చేశారనే దానిపై లెక్కలతో సహా నివేదిక తయారు చేశాడు బాధితుడు. శ్రీశైలం వద్ద తన సొంత హోటల్లో కవిత అనుచరుల విధులు, నిధులు నిర్వర్తించారని పేర్కొన్నాడు. ఆకస్మిక తనిఖీలు చేస్తా.... నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి

హోటల్ కు కావాల్సిన పాలు, నిమ్మకాయలు, నిత్యవసర సరుకులతో సహా తన సోదరుడి క్షుద్ర పూజల కోసం వినియోగించే మెటీరియల్ కూడా పోలీసుల దగ్గరి నుంచి తెప్పించుకుంటారనీ లేఖలో వెల్లడించాడు. కవిత టీమ్ లో కానిస్టేబుళ్లు రాజు, కొండల్, వసిం, హెడ్ కానిస్టేబుల్ సైదయ్య ఉన్నారని...తన కూతురు బర్త్ డే ఫంక్షన్ పేరుతో పోలీసు సిబ్బంది నుంచి భారీగా వసూళ్లు చేశారన్నారు.

పోలీసు సిబ్బందికి రాఖీ కట్టి, బహుమతిగా ఖరీదైన చీరలు, బంగారం ఖాజేస్తుందంటూ లేఖలో పేర్కొన్నాడు బాధితుడు. కొందరు సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు మేడంకు గిఫ్ట్ గా గొర్రెపోడేళ్లు, మేకపోతులు ఇచ్చారని...ఓ సీఐ నుంచి చేయి బదులుగా రూ.14 లక్షలు తీసుకుని ఎగనామం పెట్టినట్టు వెల్లడించగా పోలీస్ శాఖలో ఈ లేఖ కలకలం రేపింది.