Representational Image (File Photo)

Lucknow, Mar 4: ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీలో ఘోర ప్రమాదం (Raebareli Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు (Car) ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు 15 మీటర్ల మేర ఎగిరి ఎదురుగా వస్తున్న ఆటో కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువకుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి కారును ఆపకుండానే ఉడాయించాడు. సీసీటీవీలో రికార్డయిన వీడియోను బట్టి నిందితులను పట్టుకునే వేటలో పోలీసులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

అనంతపురంలో బొలెరో బోల్తా

అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి (18) ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం మండలంలోని ఊడెగోళం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బొలెరో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 35 మంది ఉన్నారు. వెనుక కూర్చున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు శ్రీక్యాతలింగేశ్వర, బొమ్మాలింగేశ్వర జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)