Daughter saves mother trapped under auto-rickshaw in serious accident in Mangaluru (Photo-Video Grab)

రోడ్డు ప్రమాదంలో ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు బాలిక ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది.కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..

నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..

రోడ్డు మధ్యలోకి వచ్చాక దూసుకొస్తున్న ఆటోను గమనించింది. దీంతో రోడ్డు దాటేందుకు పరుగులు పెట్టింది. చివరి క్షణంలో మహిళను గమనించిన ఆటో డ్రైవర్ ఆమెను తప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆటో వేగంగా వెళుతుండడంతో బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు. దీంతో హ్యాండిల్ ను పక్కకు తిప్పి మహిళను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు.

Here's Video

అతి వేగం కారణంగా ఆటో సదరు మహిళను ఢీ కొట్టి బోల్తా పడింది. ఆటో మీద పడడంతో మహిళ కేకలు పెట్టింది. ఇదంతా చూసిన బాలిక షాక్ నుంచి వెంటనే తేరుకుని అమ్మను కాపాడుకోవడానికి పరుగెత్తుకెళ్లి ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆటోలో ఉన్న ప్రయాణికులు బయటపడి బాలికకు సాయం చేశారు. ఆటోను పైకి లేపి మహిళను కూర్చోబెట్టారు. గాయాలపాలైన మహిళను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.