Murder Caught on Camera: నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..

పంజాబ్‌లోని పాటియాలాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. కరణ్ అనే 22 ఏళ్ల యువకుడిని మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి, దాడి చేసి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచినట్లు కెమెరాలో చిక్కుకుంది.

Murder Caught on Camera: నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..
Man Dragged Off Bike, Assaulted And Stabbed in Heart in Punjab. Screenshot of the video (Photo Credit: X/@patialapolice)

పంజాబ్‌లోని పాటియాలాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. కరణ్ అనే 22 ఏళ్ల యువకుడిని మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి, దాడి చేసి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచినట్లు కెమెరాలో చిక్కుకుంది. శుక్రవారం సాయంత్రం అబ్లోవల్ ప్రాంతంలో కరణ్ బాబు సింగ్ కాలనీకి వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.  ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)

మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కరణ్‌ను నేలపైకి ఈడ్చుకెళ్లి, వారి సహచరులకు చెందినదిగా భావిస్తున్న మరో మోటార్‌సైకిల్‌తో అతనిపై దాడి చేసినట్లు CCTV ఫుటేజీలో చూపబడింది. కత్తితో పొడిచిన తరువాత, కరణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ వెంటాడి పొడిచారు. ఆసుపత్రిలో అధిక రక్తస్రావం కారణంగా మరణించాడు. దాడి చేసిన వారిని అన్ష్, అమన్‌మీత్, యువరాజ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ దారుణమైన దాడి వెనుక వ్యక్తిగత శత్రుత్వమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 09, 2024 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).