Delhi, Feb 7: బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(Yediyurappa)కు బిగ్ రిలీఫ్. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఫిబ్రవరి, 2024లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలకు(Yediyurappa in POCSO Case) సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ (anticipatory bail)మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. అయితే పోక్సో కేసును శాశ్వతంగా కొట్టివేయడానికి నిరాకరించింది న్యాయస్థానం.
కేసుకు సంబంధించిన పిటిషన్‌పై జనవరి 17న వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై కేసు నమోదైంది.
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??
గతేడాది ఫిబ్రవరిలో బెంగళూరులోని తన నివాసంలో యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు మార్చి 14, 2024న సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణను సీఐడీకి బదిలీ చేసి, సీఐడీ మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Big Relief for Yediyurappa in POCSO Case
BREAKING
పోక్సో కేసులో యడ్యూరప్పకు బిగ్ రిలీఫ్
ఫిబ్రవరి, 2024లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో యడ్యూరప్ప
ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
పోక్సో కేసును శాశ్వతంగా కొట్టివేయడానికి నిరాకరించిన కోర్టు pic.twitter.com/d3u60lVDXe
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2025
ప్రభుత్వం తనపై కావాలనే కుట్ర పన్నిందని యడియూరప్ప ఆరోపించారు. అయితే యడియూరప్పకు ముందస్తు బెయిల్ మంజూరైన దర్యాప్తు కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేయడం విశేషం.