Hyderabad, Feb 8: రైల్వే (Train Services) ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (Indian Railways) ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు. అలాగే, గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు 11 రోజులపాటు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్ మీడియాలో ప్రకటన విడుదల
కారణం ఇదే
ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైళ్ల రద్దు ఇలా..
- సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్ (17201/170202)ను 11వ తేదీ నుంచి 21 వరకు రద్దు చేశారు.
- సికింద్రాబాద్-సిర్పూరు కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ (17233/17234) రైలును 10 నుంచి 21 వరకు రద్దు చేశారు.
- గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (12705/12706)ను 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో రద్దు చేశారు.
- విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ ప్రెస్ (1713/12714)ను 11, 14, 16, 18, 19, 20, తేదీల్లో రద్దు చేశారు.
రైళ్ల ఆలస్యం ఇలా..
- సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
- ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ (17406) 9, 11, 14, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.