Telangana Cyber ​​Security Bureau Arrests Cyber ​​Criminal Posing as Mumbai Cyber ​​Crime Police(X)

Khammam, Aug 11: ముంబై సైబర్ క్రైం పోలీస్‌గా నటిస్తున్న సైబర్ నేరగాన్ని వల వేసి పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. విశాఖపట్నంకు చెంది 39 ఏళ్ల షేక్ ఖలీల్ ముంబై సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ తప్పుడు ఆరోపణలతో డబ్బులు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలా పెద్ద సంఖ్యలో బాధితుల నుండి డబ్బు దోచుకున్నారు. నిందితుడిని వల వేసి పట్టుకున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు. ఈ కేసు క్రైం నంబర్ 52/2024, సెక్షన్ 120(బి), 419, 420 R/w 149 ఐపీసీ, ఐటి చట్టం సెక్షన్ 66D ద్వారా కేసులు నమోదు చేశారు. నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపు, హోటల్‌ యజమానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

ఖమ్మం జిల్లాకు చెందిన 51 ఏళ్ల హెడ్మాస్టర్‌తో సహా అనేక మందిని బెదిరించిన ఈ నిందితుడు తన బ్యాంక్ అకౌంట్లను అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు షేక్ ఖలీల్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గరి నుండి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ చెక్ బుక్కులు, సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఖలీల్‌ను ఖమ్మం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మొత్తం 33 సైబర్ నేరాలకు ఖలీల్ పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.