Hyderabad, Feb 7: హైదరాబాద్-విజయవాడ (Hyderabad-Vijayawada) మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు (EV Buses) అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్ తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈటీవో మోటార్స్, ఫ్లిక్స్ బస్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
హైదరాబాద్ లో ఐటీసీ కాకతీయ లో ఈటో మోటార్స్ నుండి ఫ్లిక్స్ బస్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించడం జరిగింది! pic.twitter.com/w969fV9jS4
— Ponnam Prabhakar (@Ponnam_INC) February 6, 2025
అప్పటివరకూ ధర రూ. 99 మాత్రమే
సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని కంపెనీ ప్రతినిధులు వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నవారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్ మీడియాలో ప్రకటన విడుదల