Bhakta Ramadasu Jayanti Celebrations every year in Telangana says Bhatti Vikramarka(X)

Hyd, Mar 2:  తెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు భట్టి.

భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. రామదాసును స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది సంగీత విద్వాంసులు వాగ్గేయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు. భక్త రామదాసు 392 జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు.

ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్ లో జరిగే త్యాగరాజ(Bhakta Ramadasu Jayanti Celebrations) ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, కళారత్న పురస్కార గ్రహీతలు హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, ప్రేమా రామమూర్తి, కోవెల శాంత, డివి మోహన్ కృష్ణ తదితర ఉద్దండులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ ..యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ బ్రోచర్‌-వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌..స్పోర్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన

తానిషా పాలనల్లో తహసిల్దారుగా ఉన్న రామదాసు ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తు డబ్బులతో శిథిలావస్థలో ఉన్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించడంతో తానిషా ప్రభువుల ఆగ్రహానికి గురై గోల్కొండ కోటలో ఖైదీగా మారిన చరిత్ర మనకు తెలిసిందేనన్నారు.

ప్రభుత్వ సొమ్మును రామ మందిర నిర్మాణం కోసం దుర్వినియోగం చేశాడన్న అభియోగంతో గోల్కొండ కోటలోని జైలులో ఖైదీగా చేసి, చిత్రహింసలు పెట్టినప్పటికీ తన భక్తిని కోల్పోకుండా కీర్తనలు చేసిన భక్తిపరుడు భక్త రామదాసు అన్నారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకొని అనేకమంది సంగీత విద్వాంసులుగా వాగ్దాయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న అన్నారు.

భక్తి రస వాగ్గేయకారులు కీర్తనలు సంకీర్తనలు మౌఖికంగా ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాలి.. ప్రజా ప్రభుత్వం కళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకువెళ్లే వారికి అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని ప్రముఖ వాగ్గేయ కళకారుడు గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డులను ఉగాదికి ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నాం అన్నారు. కొంత మందికి మాత్రమే కళలు సొంతం. భగవంతుడు ఇచ్చిన ఆ కళను ప్రజలకు పంచి కళాకారులు సమాజ వికాసానికి దోహదపడాలన్నారు.