యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరించారు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy). స్కూల్ యూనిఫార్మ్స్ నమూనాలను పరిశీలించారు సీఎం. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్(Young India Police School ) కూడా దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు సీఎం.

విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలలని.. స్పోర్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం.

కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న క్రమశిక్షణ సంఘం 

ఇక అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , నాయిని రాజేందర్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , కేఆర్ నాగరాజు , డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

CM Revanth Unveils Young India Police School Brochure and Website

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)