Online Betting. (Photo Credits: Pixabay)

Hyderabad, FEB 06: ఆన్‌లైన్ క్రికెట్‌ బెట్టింగ్ (Online Betting) నిర్వ‌హిస్తూ నీలేష్ చోప్రా అనే వ్య‌క్తి హైదరాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌క్తి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్‌కి చెందిన వ్య‌క్తి అని.. వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో తాజాగా ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ.. వైజ‌యంతీ బ్యాన‌ర్ (Vyjayanthi Movies) ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది.

Vyjayanthi Movies Responded Over Cricket Betting Allegations

 

నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఆన్‌లైన్ క్రికెట్‌ బెట్టింగ్ నిర్వ‌హించినందుకు ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు మా దృష్టికి వచ్చింది. అలా చెప్పబడుతున్న వ్యక్తి వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) ఆఫీస్‌లో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి ఎస్‌ఆర్ నగర్ సంబంధిత పోలీసు అధికారులతో మేము ఇప్పటికే మాట్లాడాం. ఏదైనా వార్త‌ని ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాల‌ని మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అంటూ వైజ‌యంతీ మూవీస్ రాసుకోచ్చింది.

YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు.. 

ఇదిలావుంటే నీలేష్ చోప్రా వైజ‌యంతీ మూవీస్‌కి చెందిన‌వాడ‌ని అత‌డి కేసుకి సంబంధించిన‌ ఎఫ్ఐఆర్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.