Youtuber Mastan Sai Arrested (photo-Video Grab)

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ (YouTuber Mastan Sai Arrest) చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా అతడిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మస్తాన్ సాయి షాపింగ్ చేస్తుండగా నార్సింగ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లోని ల్యాప్ టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని హార్డ్ డిస్కులో 200కు పైగా అమ్మాయిలు, మహిళల నగ్న వీడియోలు ఉన్నట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్‌ లో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజ్‌ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!

మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య (Raj Tarun, Lavanya Case) కీలక ఆరోపణలు చేసింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Youtuber Mastan Sai Arrested

వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అ‍న్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.

గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. మస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది.

గతంలో గచ్చిబౌలిలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో డ్రగ్స్ ఘటన కేసులోనూ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకంటే ముందే ఏపీలోనూ ఓ డ్రగ్స్ కేసులో ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.