![](https://test1.latestly.com/uploads/images/2025/02/telangana-government-signs-mou-with-microsoft-to-establish-ai-center.jpg?width=380&height=214)
Hyd, Feb 13:ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. మైక్రోసాఫ్ట్‌తో హైదరాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
భవిష్యత్ అంతా ఏఐదేనని.. గవర్నెన్స్ , పబ్లిక్ సేవల్లో ఏఐని ఉపయోగిస్తాం అన్నారు. ఈ కొత్త క్యాంపస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి( Microsoft AI Center in Hyderabad).
మైక్రోసాఫ్ట్ ( Microsoft)విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు రేవంత్.
మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.. మైక్రోసాఫ్ట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడుతున్నాం అన్నారు.
ఫ్యూచర్ గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ మారిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతాం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను గవర్నమెంట్ సేవల్లో వినియోగిస్తాం.. హైదరాబాద్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు..గ్లోబల్ లీడర్లను అందించే హబ్ అన్నారు.