Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి

హైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి
Hyderabad cock fight, police notices to BRS MLC Pochampalli Srinivas Reddy(X)

హైదరాబాద్ లో కోడి పందాలు(Hyderabad Cockfight), క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(MLC Pochampally Srinivas Reddy)కి నోటీసులు జారీ చేశారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌ నిర్వహణపై విచారించనున్నారు పోలీసులు.ఈ ఫామ్‌హౌస్‌ యజమానిగా ఉన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి.

ఫామ్‌హౌస్‌ కేంద్రంగా కోడిపందాలు.. క్యాసినో నిర్వహణ హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫామ్‌హౌస్‌లో (Farm House) క్యాసినో(Casino) నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. క్యాసినోతో పాటు కోడి పందాలు నిర్వహిస్తోంది ముఠా.

విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 64 మందిని పట్టుకుంది రాజేంద్రనగర్ డీసీపీ బృందం(Cockfighting at Hyderabad farmhouse). రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులు కలిసి కోడిపందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

Hyderabad cock fight, police notices to BRS MLC Pochampally Srinivas Reddy

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 13, 2025 12:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).