Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పై పంజాబ్ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
Hyderabad, Feb 7: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Trouble For Sonu Sood) పై పంజాబ్ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే.. మోహిత్ శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ వ్యవహారం హీరో సోనూ సూద్ కు తెలుసన్న సదరు లాయర్ ఏకంగా హీరోనే సాక్షిగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తమ ముందు హాజరుకావాలని సోనూ సూద్ కు సమన్లు పంపింది.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్ మీడియాలో ప్రకటన విడుదల
Trouble brews for Bollywood actor Sonu Sood as a Ludhiana court on Thursday issued an arrest warrant against him after he skipped testimony in a fraud case.
The summonses were issued to Sood in connection with case filed by Ludhiana lawyer, Rajesh Khanna, who accused one Mohit… pic.twitter.com/RuYEsCBwKo
— IndiaToday (@IndiaToday) February 6, 2025
అందుకే నోటీసులు
అయితే, తొలుత సోనూ ఆ సమన్లకు స్పందించలేదు. దీంతో కోర్టు మరోమారు నోటీసులు పంపింది. అయినప్పటికీ హీరో నుంచి జవాబు లేదు. ఇలా పలుమార్లు నోటీసులు పంపినా కోర్టు ముందు సోనూ హాజరు కాలేదు. దీంతో సోనూ సూద్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.
(The above story first appeared on LatestLY on Feb 07, 2025 07:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

