
Delhi, Mar 2: నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి విద్యాబాలన్( Vidya Balan Warns Netizens). కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో నకిలీ వీడియోలు వ్యాప్తి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విద్యాబాలన్‌కి ఆగ్రహం రావడానికి గల కారణం ఏంటంటే.. ఓ వీడియోలో AI సృష్టించిన విద్యా బాలన్ సోఫాపై కూర్చొని, "హే, నేను మీ అందరి ఫేవరెట్ విద్యా బాలన్( Vidya Balan)..." అంటూ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూవిద్యాబాలన్ భారీగా 'స్కామ్ అలర్ట్' అనే హెచ్చరికను ఉంచారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వాట్సాప్‌లో నా పేరిట పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ, అవి AI(AI-Generated Video) సృష్టించిన నకిలీ వీడియోలే. వాటిలో తాను భాగస్వామిని కాదు.. ఇలాంటి వాటిని తాను సమర్ధించనని తేల్చిచెప్పారు.
Vidya Balan Warns Netizens
View this post on Instagram
ఈ వీడియోల్లో చెప్పిన ఏదైనా విషయాన్ని తనకు సంబంధించినదిగా భావించకండి... . AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాపిస్తోందని గుర్తించి అప్రమత్తంగా ఉండండని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూచించారు.
వాస్తవానికి ఒక్క విద్యాబాలన్ ఫేక్ వీడియోనే కాదు గతంలో నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. అలాగే, దీపికా పదుకొణే, అలియా భట్, కత్రినా కైఫ్, రణవీర్ సింగ్, ఆమిర్ ఖాన్, సచిన్ టెండూల్కర్‌ని వదిలిపెట్టలేదు.
విద్యా బాలన్ చివరిసారిగా "భూల్ భులయ్యా 3" చిత్రంలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కార్తిక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషించారు. దీపావళి 2024 సమయంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అజయ్ దేవగణ్ - రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన "సింఘం అగేన్" చిత్రంతో పోటీ పడి విజయం సాధించింది.