Delhi, Feb 26:  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా సంపాదనలో షారుఖ్ దరిదాపుల్లో లేరు. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలు, ,ఐపీఎల్ ఇలా ప్రతి దాంట్లో షారుఖ్ కలిసివవచ్చిందనే చెప్పాలి. మార్కెట్ లెక్కల ప్రకారం షారుఖ్ ఆస్తులు వేల కోట్లు ఉంటాయని అంచనా.

దాదాపు మూడున్నర దశాబ్థాలుగా ఇండస్ట్రీలో ఉన్న షారుఖ్ (Shah Rukh Khan)నివసించే ఇల్లు మన్నత్(Mannat). దేశంలోని ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని విలువే దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇన్ని వేల కోట్లు ఉన్న తాజాగా షారుఖ్ ఖాన్ రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారే వార్త బాలీవుడ్‌ను షేక్ చేసింది.

ముంబైలోని పాలి హిల్ ఏరియాలోని రెండు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను ఆయన అద్దెకు తీసుకున్నారట(Rented Flat). ఇందుకు సంబంధించిన వార్త బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. అంతేగాదు ఈ ఇంటికి నెలకు రూ. 24.15 లక్షల చొప్పున ఏడాదికి రూ.2.9 కోట్ల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం.. రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు, అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్, వీడియో ఇదిగో

జాతీయ మీడియా కథనం ప్రకారం.. మన్నత్‌లో మే నెల నుంచి భారీ నవీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి అనుమతులు కావాల్సిన అవసరం ఉండటంతో, ఇటీవలే అధికారికంగా అనుమతులు మంజూరయ్యాయి. మన్నత్ గ్రేడ్ 3 హెరిటేజ్ స్టేటస్ కలిగిన భవనం కావడంతో, దీనిని విస్తరించేందుకు అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పనులు ప్రారంభించడానికి అన్ని అనుమతులు సిద్ధంగా ఉండటంతో, ఖాన్ కుటుంబం పనుల సమయంలో అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా వెళ్ళిపోతున్నారు.

ఈ రీనోవేషన్ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు రెండేళ్లు పడే అవకాశముంది. అందుకే షారుఖ్ కుటుంబం ఇల్లు మారుతున్నారని ఇది నిర్మాత వశు భగ్నానీ పిల్లలైన నటుడు జాకీ భగ్నానీ మరియు దీప్షిఖా దేశ్ముఖ్‌కి చెందినదని తెలుస్తోంది. నాలుగు అంతస్తులు 1వ, 2వ, 7వ, 8వ అంతస్తులు. ఈ అపార్ట్మెంట్‌లో ఖాన్ కుటుంబంతో పాటు, వారి భద్రతా సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది కూడా ఉంటారు. ఈ అపార్ట్మెంట్‌కి నెలకు రూ. 24 లక్షలు అద్దె చెల్లించనున్నారట.