![](https://test1.latestly.com/uploads/images/2024/09/vande-bharat-train.jpg?width=380&height=214)
Hyderabad, Feb 8: వందే భారత్ రైళ్లలో (Vande Bharat) ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల (Passengers) కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి వందే భారత్ లో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా, ప్రయాణం చేసే సమయంలో వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. అహారం అందుబాటులో ఉన్నదాన్ని బట్టి సిబ్బంది అహారం అందిస్తారని రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసింది.
Vande Bharat Passengers Can Buy Food Onboard Even If They Opt Out During Ticket Booking: Railwayshttps://t.co/bBeFbUBayD
— Daily Excelsior (@DailyExcelsior1) February 7, 2025
ఎందుకు ఇలా??
వందే భారత్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కొందరు వేరే ఆహారాన్ని చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్ ను స్కిప్ చేస్తుంటారు. అయితే, ఒక్కోసారి ఇలా చేసుకోవడం వల్ల రైళ్లలో డబ్బులు ఇచ్చి కొందామన్నా కూడా ఆహారం ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఈ సదుపాయాన్ని కల్పించింది.