BJP Flag (Photo Credit: ANI)

Newdelhi, Feb 8: ఢిల్లీలో కమలం (BJP) వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో (Delhi Assembly Elections) మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతుండటం గమనార్హం. క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌ డేట్స్ కోసం కింది లైవ్ ను చూడండి..

ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? ఆమ్ ఆద్మీ పార్టీనా? బీజేపీనా? లేక హస్తమా?? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌ డేట్స్.. (లైవ్)

LIVE:

రిజల్ట్స్ దాదాపుగా అలాగే..

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈనెల 5వ తేదీన పోలింగ్‌ జరగ్గా 60.54 శాతం ఓటింగ్‌ నమోదైంది. తమ పార్టీ దగ్గర దగ్గరగా 50 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా అధికారంలోకి వస్తుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పాయి. ప్రస్తుతం వెలువడుతున్న రిజల్ట్స్ దాదాపుగా అలాగే ఉన్నాయి.

జగన్ అసెంబ్లీలో అడుగుపెడతాడా ? ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం

కేజ్రీకి నోటీసులు

అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పుతాయని, కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్‌ చెబుతోంది. మరోవైపు.. బీజేపీ నేతలు తమ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేరాలని, ప్రలోభపెట్టారని ఇందుకు రూ.15 కోట్లు ఇవ్వజూపారని కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ లెఫ్ట్ నెంట్‌ గవర్నర్‌ విచారణకు ఆదేశించారు. ఈమేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం కేజ్రీవాల్‌ కు నోటీసులు జారీచేశారు.