![](https://test1.latestly.com/uploads/images/2025/02/delhi-election-results-2025-bjp-comeback-after-27-years.jpg?width=380&height=214)
Delhi, Feb 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయ ఢంకా మోగించింది( Delhi Election Results 2025). అవినీతికి వ్యతిరేకింగా స్థాపించిన ఆప్.. అదే అవినీతి ఆరోపణలతో ఓటమి పాలైంది. ముఖ్యంగా బీజేపీకి ఇది చిరస్మరణీయ విజయమనే చెప్పాలి(Delhi Assembly elections). 27 ఏళ్ల నీరిక్షణకు తెరదించుతూ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో ఎన్నికలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్(AAP) కీలక నేతలు ఓటమి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంగా మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటమి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. తన కంచుకోట న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి పాలు అయ్యారు. వరుసగా మూడు సార్లు ఈ స్థానాన్ని గెలచుకున్న కేజ్రీవాల్ నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
అలాగే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సైతం ఓటమి పాలు కాగా ఆప్‌కు రిలీఫ్‌కు దక్కే విషయం సీఎం అతిశీ గెలుపొందడం. కల్కాజి నుంచి అతిశీ గెలుపొందగా బాబర్ పూర్ నుంచి గెలుపొందిన గోపాల్ రాయ్, బల్లిమారన్ నుంచి గెలుపొందిన ఇమ్రాన్ హుస్సేన్ విజయం సాధించారు. ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రతిపక్ష పార్టీగానే కాదు ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఇక బీజేపీ(BJP) అనూహ్య రీతిలో విజయం సాధించగా గెలుపొందిన వారిలో ఎక్కువ మంది వందల ఓట్ల తేడాతోనే గెలుపొందారు. ఇక బీజేపీ నుండి సీఎం రేసులో ప్రధానంగా కేజ్రీవాల్‌పై గెలుపొందిన పర్వేశ్ సింగ్, మనోజ్ తివారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేక సున్నాకే పరిమితమైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రియాంకా గాంధీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు మార్పునకు ఓటు వేశారు. రాజధాని ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీలపై ఢిల్లీ ఓటర్లు నమ్మకం ఉంచారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విషయంలో గర్వంగా ఉన్నామని చెప్పారు.
బీజేపీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. ప్రజాశక్తే అత్యున్నతమని, ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలనలు విజయం సాధించాయన్నారు. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇది తమ గ్యారంటీగా మోదీ వెల్లడించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఎల్జీ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాన్ని సీజ్ చేయాలని జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోరాడిన ఆప్ శ్రేణులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీరును శిరసావహిస్తున్నామని చెప్పారు. విజయం సాధించిన బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు అన్యాయం చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడని అన్నారు రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్. ఢిల్లీలోని నీటి, గాలి కాలుష్యం, వీధుల్లో నెలకొన్న పరిస్థితుల వల్లే కేజ్రీవాల్ కూడా ఆయన సీటును కోల్పోయారని చెప్పారు.