ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్.. ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం(Delhi Assembly Elections) అన్నారు. విజయం సాధించిన బీజేపీ పార్టీకి అభినందనలు తెలిపారు.
బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను అని వెల్లడించారు. తాము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా, ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకుంటాం అని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. గత 10 సంవత్సరాలలో తాము ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామన్నారు.
27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగురవేసింది బీజేపీ(Delhi Assembly Elections). ఇక ఆప్ కీలక నేతలు కేజ్రీవాలు, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలు పరాజయం పాలయ్యారు. అయితే ఆప్‌కు స్వల్ప ఊరట కలిగించే విషయం ఏంటంటే.. సీఎం అతిశీ(Delhi CM Atishi) గెలుపొందారు.
Arvind Kejriwal reacts on Delhi election results
#WATCH | On #DelhiElection2025, AAP national convener and former Delhi CM, Arvind Kejriwal, "We accept the mandate of the people with great humility. I congratulate the BJP for this victory and I hope they will fulfil all the promises for which people have voted them. We have… pic.twitter.com/VZOwLS8OVH
— ANI (@ANI) February 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)