Delhi Chief Minister Atishi beat BJP's Ramesh Bidhuri (X)

Delhi, Feb 8:  27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగురవేసింది బీజేపీ(Delhi Assembly Elections). ఇక ఆప్ కీలక నేతలు కేజ్రీవాలు, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలు పరాజయం పాలయ్యారు. అయితే ఆప్‌కు స్వల్ప ఊరట కలిగించే విషయం ఏంటంటే.. సీఎం అతిశీ(Delhi CM Atishi) గెలుపొందారు.

కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరి(Ramesh Bidhuri)ని ఓడించారు. చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్లు కౌంటింగ్ జరుగగా చివరకు రమేశ్ బిధూరిపై అతిశీ విజయం సాధించారు.

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట అయిన న్యూఢిల్లీలో ఓటమి పాలయ్యారు. మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుండి గెలుపొందిన కేజ్రీవాల్ తాజాగా బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోయారు.   ఆప్‌కు బిగ్ షాక్, కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓటమి.. అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్, వాటర్ స్కాం, అవినీతి ఆరోపణలు ఆప్ కొంపముంచాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీకి కొత్తగా సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఓ టమి ఆప్ రాజకీయ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

జంగ్‌పురా నియోజకవర్గం పోటీ చేసిన మనీష్ సిసోడియా తన ఓటమిని అంగీకరించారు. పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారు.. మనమంతా కష్టపడ్డాం. ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చారు. కానీ, నేను 600 ఓట్ల తేడాతో ఓడిపోయాను అన్నారు. గెలిచిన అభ్యర్థికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ నియోజకవర్గం కోసం మంచిగా పనిచేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు.