ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ(Delhi Assembly Elections). ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. ఇక ఆప్ కీలక నేతలంతా ఓటమి అంచున ఉన్నారు. తాజాగా ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి తర్వెందర్ సింగ్ విజయం సాధించారు. 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యారు.
ఇక న్యూఢిల్లీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Kejriwal) ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండ్‌కు ఫలితం మారుతూ రాగా చివరకు ఓటమి పాలయ్యారు కేజ్రీవాల్. 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కేజ్రీవాల్.
ఢిల్లీలో కమల వికాసం.. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!
ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం బీజేపీకి 48 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం, కాంగ్రెస్‌కి 6.7 శాతం ఓట్ షేర్ వచ్చింది. కోండ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ గెలిచారు.
Kejriwal, Manish Sisodia defeat in Delhi Assembly Elections
AAP's Manish Sisodia & party's candidate from Jangpura constituency concedes defeat in Delhi Election 2025
— ThePrintIndia (@ThePrintIndia) February 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)