
Hyd, March 06: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం..శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అన్నారు మోదీ. ఏపీలోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై మోదీ అభినందనలు చెప్పారు(Telangana MLC Elections).
కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు . తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేత ఎవరో తేలక పోవడంతో మూడో స్థానంలో నిలిచిన ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని విజయం వరించింది.
మొత్తం 56 మంది బరిలో నిలవగా 2,52,029 మంది ఓటేశారు. 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672 ఓట్లుగా అధికారులు నిర్ణయించారు.
PM Modi on Telangana MLC Elections BJP Victory
ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి @BJP4Telangana ను ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను.@MalkaKomaraiah @AnjiReddy_BJP
— Narendra Modi (@narendramodi) March 6, 2025
అంజిరెడ్డి విజయం పట్ల కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని... తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని తెలిపారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ గెలిచిందని తెలిపారు. ఇది తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుకు నాంది అని తెలిపారు బండి.