Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.
Hyd, March 2: తెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు(Telangana) సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.
కిషన్ రెడ్డి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు... ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి(Kishan Reddy) అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).
SLBC పాపం కల్వకుంట్ల చంద్రశేఖర రావుదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పనులను సగంలో ఆపడం వల్లే 8 మంది కార్మికులు చనిపోయారు.. రాయలసీమకు నీళ్లు తరలిపోవడానికి కారణం కేసీఆర్ కాదా ? అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నా వనపర్తిని మర్చిపోను.. నాకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన ప్రాంతం ఇది
అన్నారు.
Modi Shows Sympathy Towards Telangana, But Kishan Reddy Harbors Hatred: CM Revanth Reddy
ఇన్నేళ్లు గడిచినా నన్ను గుర్తుపెట్టుకొని సీఎం హోదాలో రేవంత్ నా ఇంటికి రావడం చాలా గర్వంగా ఉంది
మా ఇంట్లో అద్దెకు ఉంటున్నప్పుడు కూడా పార్వతక్కా అని ఎంతో ప్రేమగా పిలిచేవాడు
ఇప్పుడు కూడా అదే ప్రేమతో పార్వతక్కా అని నన్ను దగ్గరకు తీసుకున్నాడు
రేవంత్ రెడ్డికి ఇష్టమని పూరి, కీమా… pic.twitter.com/AI2qHTrcgK
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025
రాజకీయాల్లో నేను రాణించడంలో వనపర్తిది ప్రత్యేకమైన పాత్ర.. ఈ ప్రాంతంతో నాది ఎప్పటికీ తెగిపోలేని బంధం అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

