Viral Video: వీడియో ఇదిగో.. ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్.. రైలు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చినా తన పిల్లలను కాపాడుకుంది..

Viral Video: వీడియో ఇదిగో.. ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్.. రైలు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చినా తన పిల్లలను కాపాడుకుంది..
Mother Protects Children as Train Brushes Past (Photos: Bharat Mata ke Sewak/X)

Viral Video: వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి తన శరీరాన్నే కవచంగా మార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. ప్లాట్‌ఫామ్‌కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు భయంతో గోడకు అతుక్కుని ఉన్నారు. వారిని రైలు ఏమాత్రం తగలకుండా తల్లి అడ్డుగా నిలబడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

షాకింగ్ వీడియో ఇదిగో.. బుర్ఖా వేసుకున్న మహిళపై దారుణం.. అక్కడ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్..

రైలు అత్యంత సమీపం నుంచి వేగంగా వెళ్తున్న సమయంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో కేకలు వేశారు. రైలు పూర్తిగా వెళ్లిపోయేంత వరకు ఆ తల్లి, పిల్లలు క్షణక్షణం భయంతో అదే స్థితిలో ఉండిపోయారు. చివరికి రైలు వెళ్లిన తర్వాత వారు సురక్షితంగా పైకి లేవడంతో అక్కడున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను 'భారత్ మాతా కే సేవక్' అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయగా.. ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Mother Lies Over Children as Train Speeds Past in Terrifying Footage

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 11, 2026 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).