H-1B Visa Alert: హెచ్-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సిందే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదన..
అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ (H-1B) సహా పలు రకాల వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది.
H-1B Visa Alert: అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ (H-1B) సహా పలు రకాల వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది. ఈ నిబంధన గనుక అమల్లోకి వస్తే అమెరికాలోని టెక్నాలజీ, సేవా రంగాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
మైనర్ పిల్లల US వీసాపై కీలక అప్‌డేట్.. తల్లిదండ్రులకు ఎంబసీ వార్నింగ్.. ఈ తప్పు చేయొద్దని సూచన
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు లేఆఫ్స్ లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే, 60 రోజుల పాటు అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండవచ్చు. ఈ వ్యవధిలో మరొక కంపెనీలో ఉద్యోగం సంపాదించి, కొత్త యజమాని ద్వారా వీసా స్పాన్సర్‌షిప్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగం దొరకని పక్షంలో తమ ఇల్లు, పిల్లల చదువులు, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుని దేశం విడిచి వెళ్ళేందుకు ఈ సమయం ఎంతో సహాయపడేది. అయితే ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న నూతన ప్రతిపాదనతో ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడవాల్సి రావడం లేదా తక్షణమే ప్రత్యామ్నాయ వీసా మార్గాలను వెతుక్కోవాల్సి రావడం జరుగుతుంది.
ఈ నూతన నిబంధన ప్రభావం కేవలం హెచ్-1బీ వీసాదారులకే పరిమితం కాకుండా L-1, O-1, TN, E-1, E-2 మరియు ఆస్ట్రేలియాకు చెందిన E-3 వర్క్ వీసాదారులపై కూడా పడనుంది. స్వదేశీ అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఇది ఇంకా తుది నిర్ణయం కాదని, రెండు నెలల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరమే ట్రంప్ సర్కార్ దీనిపై తుది ముద్ర వేయనుందని ఇమిగ్రేషన్ నిపుణులు వెల్లడించారు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు మరింత అనిశ్చితిలో పడే అవకాశముంది.
(The above story first appeared on LatestLY on Sep 11, 2026 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

