US Visa Rule for Children: మైనర్ పిల్లల US వీసాపై కీలక అప్‌డేట్.. తల్లిదండ్రులకు ఎంబసీ వార్నింగ్.. ఈ తప్పు చేయొద్దని సూచన
పిల్లల యూఎస్ (USA) వీసా దరఖాస్తులపై తల్లిదండ్రులకు ఉన్న ఒక ప్రధాన అపోహకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెరదించింది. తమ పిల్లల కోసం వీసా కోరే తల్లిదండ్రులు, ఆ బిడ్డ నవజాత పసికందు అయినప్పటికీ.. ఇంటర్వ్యూ కౌంటర్ వద్ద వ్యక్తిగతంగా తీసుకురావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
US Visa Rule for Children: పిల్లల యూఎస్ (USA) వీసా దరఖాస్తులపై తల్లిదండ్రులకు ఉన్న ఒక ప్రధాన అపోహకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెరదించింది. తమ పిల్లల కోసం వీసా కోరే తల్లిదండ్రులు, ఆ బిడ్డ నవజాత పసికందు అయినప్పటికీ.. ఇంటర్వ్యూ కౌంటర్ వద్ద వ్యక్తిగతంగా తీసుకురావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. వయస్సుతో సంబంధం లేకుండా మైనర్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తేల్చిచెప్పింది. అమెరికా రాయబార కార్యాలయం తన "వీసా ఫ్రైడే" సోషల్ మీడియా కార్యక్రమంలో ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చింది.
రాయబార కార్యాలయం ఏం చెప్పిందంటే?.. చాలా చిన్న పిల్లలకు లేదా పసికందులకు కాన్సులర్ ఇంటర్వ్యూ నుండి మినహాయింపు ఉంటుందని భావించడం అపోహ మాత్రమేనని అధికారులు తెలిపారు. వీసా జారీ చేసే ప్రక్రియలో కాన్సులర్ అధికారి ప్రతి దరఖాస్తుదారుడిని వ్యక్తిగతంగా చూడటం కాన్సులర్ విధానంలో అత్యంత కీలకమైన భాగం. సరిహద్దు భద్రత, జాతీయ భద్రత మరియు ప్రజా భద్రత అనే ప్రధాన లక్ష్యాలతోనే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పుట్టిన పసిపాప నుంచి 18 ఏళ్ల లోపు మైనర్ల వరకు ప్రతీ ఒక్కరినీ ఇంటర్వ్యూకు భౌతికంగా తీసుకురావాల్సిందే. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బిడ్డ లేకుండా హాజరైతే దరఖాస్తు ముందుకు సాగదు.
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు.. కారణం ఏంటంటే..
పిల్లల వీసా ఫోటో నిబంధనలు (US Visa Photo Rules): ఇంటర్వ్యూకి హాజరుకావడంతో పాటు, దరఖాస్తు సమయంలో సమర్పించే పిల్లల ఫోటో నిబంధనలను కూడా అమెరికా విదేశాంగ శాఖ కఠినతరం చేసింది. ఫోటో ఖచ్చితంగా 2x2 అంగుళాలు (51x51 మిమీ) ఉండాలి. డిజిటల్ ఫైల్ అయితే 600x600 నుండి 1200x1200 పిక్సెల్‌ల మధ్య, JPEG ఫార్మాట్‌లో 240 KB కంటే తక్కువగా ఉండాలి. సాదా తెలుపు బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. తల ఫోటోలో 50-69% భాగాన్ని ఆక్రమించాలి. రెండు కళ్లు తెరిచి, తటస్థమైన (Neutral) ముఖ కవళికలు ఉండాలి. శిశువులకు సహజమైన భంగిమ చాలు. ఫోటో గత 6 నెలల వ్యవధిలో తీసింది మాత్రమే అయి ఉండాలి. కళ్లజోడు, టోపీలు లేదా ముఖం కనిపించకుండా తల కప్పుకోవడం నిషిద్ధం (మతపరమైన కారణాలు మినహా).
ఇంటర్వ్యూలో అడిగే అవకాశమున్న ప్రశ్నలు: మైనర్ దరఖాస్తుదారుల తరఫున అధికారులు కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు వాటికి స్థిరమైన సమాధానాలు, తిరుగు ప్రయాణ టికెట్లు మరియు ఆదాయ ఆధారాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
1. అమెరికా సందర్శనకు కారణం ఏమిటి?
2. ప్రయాణ మరియు వసతి ఖర్చులను ఎవరు భరిస్తున్నారు?
3. మీ కుటుంబ సభ్యులెవరైనా ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారా?
4. తిరిగి ఎప్పుడు స్వదేశానికి వస్తున్నారు?
అమెరికా వీసా కోరుకునే తల్లిదండ్రులు ఈ నిబంధనలను గమనించి, ఇంటర్వ్యూ సమయంలో తమ పిల్లలను వెంట తీసుకురావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

