US Visa Revocations: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు.. కారణం ఏంటంటే..

అమెరికా వీసా అనేది ఎవరికీ రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం (Privilege) మాత్రమే అని తేల్చిచెప్పింది. తమ దేశపు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారి నుండి పౌరులకు రక్షణ కల్పించేందుకు ఎంతటి కఠిన చర్యలైనా తీసుకుంటామని స్పష్టం చేసింది.

US Visa Revocations: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు.. కారణం ఏంటంటే..
Donald Trump (Photo- AFP)

US Visa Revocations: జాతీయ భద్రత, చట్టాల ఉల్లంఘనలను సహించేది లేదని స్పష్టం చేస్తూ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలకు చెందిన పౌరులకు జారీ చేసిన సుమారు 1,75,000కు పైగా వీసాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన నిరంతర భద్రతా సమీక్షలో భాగంగానే ఈ భారీ వీసాల రద్దు ప్రక్రియ చేపట్టినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం విడుదల చేసిన 'ఫ్యాక్ట్ షీట్'లో తెలిపింది.

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కార్యకలాపాలు, మోసపూరిత పత్రాల సమర్పణ, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం, హింసను ప్రేరేపించడం వంటి తీవ్ర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దర్యాప్తు సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. రద్దయిన వీసాల్లో మద్యం తాగి వాహనాలు నడపడం (DUI), దాడులు, చోరీలు, మాదకద్రవ్యాల విక్రయాలు వంటి నేరాలకు పాల్పడిన వారివి అత్యధికంగా ఉన్నాయి.

భారతీయ ప్రయాణికులకు అబుదాబి బంపర్ ఆఫర్.. ఉచిత యూఏఈ వీసా.. ఎవరు అర్హులంటే..

మరికొన్ని తీవ్రమైన కేసులను కూడా విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. అత్యాచారం, కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక వేధింపుల వంటి అనాగరిక నేరాలకు పాల్పడిన వారి వీసాలను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపింది. వీటితో పాటుగా కేవలం అమెరికా భూభాగంలో జన్మించే పిల్లలకు పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో వచ్చే 'బర్త్ టూరిజం'ను అరికట్టేందుకు కూడా వీసాలను రద్దు చేశారు. విదేశాంగ విధాన ప్రాధాన్యతల దృష్ట్యా క్యూబా, ఇరాన్, లావోస్, కువైట్ దేశాలకు చెందిన పలువురి వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ విదేశీ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికీ రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం (Privilege) మాత్రమే అని తేల్చిచెప్పింది. తమ దేశపు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారి నుండి పౌరులకు రక్షణ కల్పించేందుకు ఎంతటి కఠిన చర్యలైనా తీసుకుంటామని స్పష్టం చేసింది. వీసా అనేది కేవలం అమెరికా సరిహద్దుల వరకు రాగల అనుమతి పత్రం మాత్రమేనని.. దేశంలోకి ప్రవేశించనివ్వాలా లేదా అనేది ఇమ్మిగ్రేషన్ అధికారుల తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పునరుద్ఘాటించింది.

(The above story first appeared on LatestLY on Aug 11, 2026 08:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).